Maoist: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు మరోసారి విజయవంతమైన ఆపరేషన్ చేపట్టారు. తిర్కామేట అటవీప్రాంతంలో కూంబీంగ్ నిర్వహించిన సమయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న మావోయిస్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వ్యక్తి బాంరగడ్ దళానికి చెందిన శంకర్ భీమ మహాకా. ఇతనిపై రూ.2 లక్షల రివార్డ్ ఉంది. దహనం, హత్యలు, మందుపాతరలు వంటి పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్, 6.67 అంగుళాల HD+ లతో కేవలం రూ.10499లకే Realme P3 Lite 5G లాంచ్!
అదనంగా, ఎన్ఐఏ విచారణ జరుపుతున్న హత్యకేసులో కూడా ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. గడ్చిరోలి పోలీసులు 2022 సంవత్సరం నుండి ఇప్పటి వరకు మొత్తం 109 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన విషయం గమనార్హం. స్థానిక భద్రతా బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబీంగ్ ఆపరేషన్లను మరింత బలోపేతం చేస్తున్నాయి.
Hyderabad : ఒకవైపు క్లాస్ రూమ్స్ మరోవైపు డ్రగ్స్ తయారీ, బోయినపల్లి మేధా స్కూల్ షాకింగ్ రహస్యాలు
