Site icon NTV Telugu

Gadari Kishore : తాటాకు చెప్పుళ్లకు భయపడము.. పార్టీ కోసం ప్రజలకోసం పనిచేస్తాం

Gadari Kishore

Gadari Kishore

Gadari Kishore : జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై విచారణ జరిగింది. సీఎం రమేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయన శనివారం విచారణకు హాజరయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు పోలీసులు ఆయనను ప్రశ్నించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన గాదరి కిషోర్ మాట్లాడుతూ.. “మా నాయకుడు కేటీఆర్‌పై సీఎం రమేష్ దూషణలు చేశారు. దానికి సమాధానంగా నేను మాట్లాడాను. కానీ నాపై కుట్రపూరితంగా కేసు నమోదు చేశారు. నేను అనని వాఖ్యలను వీడియోల రూపంలో చిత్రీకరించి నాపై ఆరోపణలు మోపారు” అని అన్నారు.

Manipur : మణిపూర్‌లో ఉగ్రదాడి.. ఉద్రిక్తతలు చెలరేగిన పరిస్థితి !

“ఆయన టీడీపీ ఎంపీనా? బీజేపీ ఎంపీనా? అర్ధం కాని స్థితిలో ఉన్నారు. రాజకీయాలకన్నా వ్యాపారాల మీదే ఆయన దృష్టి ఉంది. కేటీఆర్‌పై వ్యక్తిగత దూషణలు చేశారు. మేము మాత్రం పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తాం. తాటాకు చెప్పుళ్లతో మమ్మల్ని భయపెట్టలేరు” అని స్పష్టం చేశారు. తాను చట్టాలను గౌరవిస్తానని, అందుకే ఈరోజు విచారణకు హాజరయ్యానని గాదరి కిషోర్ తెలిపారు. “పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను” అని ఆయన వెల్లడించారు.

Russia Airspace Violation: రష్యా బరితెగింపు.. దీటుగా స్పందించిన నాటో కూటమి..

Exit mobile version