Warangal Mgm Hospital: వరంగల్ ఎంజీఎం మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయడం లేదు. దీంతో మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండలతో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో మార్చరీలో చల్లదనం కరువైందని మండిపడుతున్నారు. అయితే మార్చురీలోనే మృతదేహాలు ఉంచడంతో.. మృతదేహాల నుంచి కుళ్లిపోయిన వాసన రావడం పరిసర ప్రాంతాల్లో చర్చకు దారితీస్తోంది. అయితే ఎంజీఎంకు వెళ్లే రోగులు ఈ దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుడు మార్చురీలో పనిచేస్తున్న సిబ్బంది సైతం ఈ సమస్యను తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటున్నారు.
Read also: KKR vs PBKS: నేడు కోల్‌కతాతో పంజాబ్ కింగ్స్ ఢీ.. ఈ మ్యాచ్కు ధావన్ దూరం..
ఉమ్మడి వరంగల్ జిల్లాకి పెద్ద ఆసుపత్రిగా పిలువబడే ఎంజీఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందిన లీగల్ కేసులను సైతం ఈ మార్చరిలోనే పోస్టుమార్టం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలలో మృతి చెందిన గుర్తు తెలియని మృతదేహాలను కూడా మూడు నాలుగు రోజులు మార్చురీలోనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సుమారుగా ఒక రోజుకి 6 నుండి 10 వరకు మృతదేహాలకు ఈ మార్పురిలో శివ పరీక్షలు నిర్వహిస్తుంటారు. జనావాసాల మధ్య మార్చురీ ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read also: AP Elections 2024: ఏపీలో ఈరోజు నామినేషన్ల స్క్రూట్నీై!
అయితే ఇక్కడకు వచ్చిన రోగులు, మార్చురీలో పనిచేస్తున్న సిబ్బంది మాట్లాడుతూ.. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఆవేడికి మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయడం లేదని దీనివల్ల తీవ్రంగా దుర్వాసన వస్తుందని పేర్కొన్నారు. దీని వల్ల మార్చురీవద్ద కూర్చోలేని పరిస్థితి ఉందని అంటున్నారు. అంతే కాకుండా లోపల సెక్యూరిటీతో ఉండాల్సిన వారు సైతం ఈ దుర్వాసనతో రోగాల బారిన పడే అవకాశం ఉందని వాపోతున్నారు. ఫ్రీజర్లలో ఉండే మృతదేహాలను త్వరగా కాల్చివేయాలని, లేదంటే ఫ్రీజర్లను బాగుచేయించాలని కోరుతున్నారు.
Read also: ED Raids : ముంబైలో ఈడీ దాడులు.. రూ.73కోట్ల ఆస్తుల జప్తు
ఇక ఎంజీఎంకు వచ్చే రోగుల పరిస్థితి అయితే వర్ణనాతీతం అని చెబుతున్నారు. ఇక్కడకు రోగం నయం కోసం వస్తే మృతదేహాలతో వస్తున్న వాసనతో తీవ్ర అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంజిఎం అధికారులు వెంటనే స్పందించి వీటిని పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే వీటిపై చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు. మరి దీనిపై ఎంజిఎం అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Diamond Jewellery: జూబ్లీహిల్స్ లో కోటి వజ్రాభరణాలు చోరీ.. ట్యాక్సీ డ్రైవర్ పై అనుమానం..