హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఒకటైన సెంచురీ ఆస్పత్రి జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో వాకర్ల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని వయసులకు చెందిన 200 మందికి పైగా వాకర్లు ఈ శిబిరంలో పాల్గొని ఉచితంగా వైద్యపరీక్షలు చేయించుకున్నారు. దాంతో పాటు శిబిరంలో పాల్గొన్న వైద్యుల నుంచి సలహాలతో ప్రయోజనం పొందారు.
రక్తపోటు పరీక్ష, ర్యాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలు, ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ విశ్లేషణ లాంటి పరీక్షలను శిబిరానికి వచ్చిన 200 మందికి పైగా చేయించుకున్నారు. శిబిరానికి వచ్చిన సెంచురీ ఆస్పత్రి వైద్యులు పరీక్ష ఫలితాలను విశ్లేషించి వారు భవిష్యత్తులో ఏం చేయాలో తెలిపారు. ఇక్కడ పరీక్షలు చేయించుకున్నవారిలో అప్పటికే ఉన్న, లేదా ఉన్నట్లు భావిస్తున్న ఆరోగ్య సమస్యలపై తదుపరి వైద్య పరీక్షల కోసం సెంచురీ ఆస్పత్రి రాయితీలను కూడా ప్రకటించింది.
ఈ సందర్భంగా సెంచురీ ఆస్పత్రి సీఈవో డాక్టర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ.. ‘మనిషి చేయగల మంచి పనుల్లో ఆరోగ్యం కోసం నడవడం ఒకటి. మరింతమంది ప్రజలు నడవడం, ఆరోగ్యకరమైన వ్యాయామాలు చేయడం దిశగా వారిని ప్రోత్సహించడానికే ఈ శిబిరాన్ని నిర్వహించాం. సెంచురీ ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది అంతా ఆరోగ్యకరమైన జీవనశైలినే ప్రోత్సహిస్తాం. ఆరోగ్యకరమైన సమాజం కోసం పాటుపడేవారికి మా సాయం, మద్దతు ఎప్పుడూ ఉంటాయి’ అని చెప్పారు.
