Bhadradri Ramaiah: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాద్రి శ్రీరామచంద్రుని కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. దీంతో భద్రాచలం రాములోరి ఆలయం మరింత సుందరంగా మారింది. భారతదేశంలోనే రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రేపు (ఏప్రిల్ 17)న నిర్వహించనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ముస్తాబవుతోంది. కల్యాణ క్రతువులో పాల్గొనడం, కల్యాణాన్ని దగ్గరగా చూడటం శుభప్రదంగా భావిస్తారు. పురాణాల ప్రకారం సీతారాముల అష్టైశ్వర్యాలను ప్రత్యక్షంగా దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోయి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులంతా సీతారాముల కల్యాణం చూడాలన్నారు. దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు.
Read also: Ritika Nayak: షార్ట్ డ్రెస్సులో రితిక నాయక్ అందాలు..
ఈ నేపథ్యంలో భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి మాట్లాడుతూ ప్రత్యేక పూజలు, వంద రూపాయల దర్శనం నిలిపివేసి భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులకు దర్శనంతో పాటు నిత్యం అన్నదాన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకుని సీతారాముల కల్యాణానికి ఉచిత తలంబ్రాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈఓ కోరారు. ఎన్నికల కోడ్ కారణంగా ఈ కల్యాణ మహోత్సవం ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు పర్యవేక్షించకపోగా, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్.రమాదేవి ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రాములోరి మహోత్సవం. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.