Site icon NTV Telugu

టీనేజర్లకు ఇనార్బిట్ మాల్‌లో ఉచిత టీకా

కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టిడి చేసేందుకు కోవిడ్‌ టీకాలను పంపిణీ చేస్తోంది. అయితే ఇటీవల 15 నుంచి 18 సంవత్సరాల వయసుగల యువతకు కూడా కోవిడ్‌ టీకాలు పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యువత కోవిడ్‌ టీకాలను తీసుకోవాలంటూ అవగాహన కల్పిస్తోంది. యువతను ఆకర్షించేందుకు ఇనార్బిట్‌ మాల్‌లో ఉచిత టీకాను అందజేయనున్నట్లు ఆ మాల్‌ నిర్వాహకులు వెల్లడించారు. 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతను వారి తల్లిదండ్రులు కోవిడ్‌ టీకా మొదటి డోస్‌ కోసం ఇనార్బిట్‌ మాల్‌లో ఉచితంగా వేయించవచ్చు. మాల్ ప్రముఖ హాస్పిటల్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. జనవరి-ఫిబ్రవరిలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య టీకాను అందజేస్తుంది.

“మేము, ఇనార్బిట్ మాల్ హైదరాబాద్‌లో, మా కస్టమర్‌లకు మేము చేయగలిగిన విధంగా సేవలందించడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మరియు వారి పిల్లలకు ఇనార్బిట్‌లో సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు స్వచ్ఛమైన వాతావరణంలో టీకాలు వేయించాలని నేను కోరుతున్నాను, అది కూడా ఉచితంగా’ అని ఇనార్బిట్‌ మాల్‌ సెంటర్‌ హెడ్‌ శరత్ బెలవాడి అన్నారు.

వాక్-ఇన్ క్యాంప్‌కు ఆరోగ్య సేతు యాప్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం. తల్లిదండ్రులు వారి పిల్లలకు మొదటి డోస్‌ కోసం వారి ఆధార్ కార్డ్‌ని తీసుకెళ్లాలి. టీకాలు వేసుకున్న అభ్యర్థులందరూ కనీసం 30 నిమిషాలు అక్కడే వేచి ఉండాలి. ఏదైనా సహాయం కోసం వైద్యుల బృందం సిద్ధంగా ఉంటుంది. టీకా శిబిరం గురించి మరింత సమాచారం కోసం 8008054704 ఫోన్‌ నెంబర్‌ను సంప్రదించండి.

Exit mobile version