NTV Telugu Site icon

Cyber Frauds: ట్రాఫిక్ చలాన్ల పేరుతో మోసాలు.. జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు

Frauds In The Name Of Traffic Challans

Frauds In The Name Of Traffic Challans

Cyber Frauds: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా పెరుగుతున్నాయి. మోసగాళ్లు.. రకరకాల మార్గాలను ఎంచుకుని.. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మనం బుక్ చేసుకోకపోయినా.. మా పేరు మీద డెలివరీ వచ్చిందని వస్తారు. మనం బుక్ చేసుకోలేదు అంటే.. సరే రద్దు చేస్తాం.. ఓటీపీ చెప్పండి. మేం చెప్పాం.. అంతే. ఇవే కాకుండా.. ఈకేవైసీ, ఖరీదైన బహుమతులు, ఓఎల్‌ఎక్స్, క్రెడిట్, డెబిట్ కార్డ్ యాక్టివేషన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిని చూస్తూనే ఉన్నాం. మోసాల జాబితాలోకి ట్రాఫిక్ చలాన్ కూడా చేరింది. ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలంటూ మెసేజ్ లు పంపుతూ కొందరు మోసగాళ్లు బాధితుల ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. రోడ్లపై వాహనాలతో ప్రయాణిస్తున్నప్పుడు.. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే.. పోలీసులు జరిమానా విధిస్తారు. ఆ తర్వాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు చలాన్ యొక్క జరిమానా వివరాలు సందేశం రూపంలో పంపబడతాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనంపై ట్రాఫిక్ చలాన్లు ఉంటే అక్కడికక్కడే వాహనదారుడి మొబైల్ ఫోన్‌కు లింక్ పంపి డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు దీన్ని అవకాశంగా మార్చుకున్నారు. ట్రాఫిక్ చలాన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు.

Read also: Ponguleti-Tummala: దాదాపు నాలుగేళ్ల తర్వాత.. తుమ్మల ఇంటికి పొంగులేటి..!

మెసేజ్‌లు పంపి, లింక్‌ల ద్వారా డబ్బులు వసూలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులను అవకాశంగా చేసుకున్న కొందరు సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీశారు. ట్రాఫిక్ పోలీసులు పంపినట్లుగా వాహనదారులకు సందేశాలు పంపుతున్నారు. ఆ తర్వాత చెల్లింపు చేయడానికి లింక్ కూడా పంపబడుతుంది. ట్రాఫిక్ చలాన్ ఉందని భావించి లింక్ క్లిక్ చేస్తే వాహనదారుల ఖాతాల్లోంచి డబ్బులు మాయమవుతాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి నకిలీ చలాన్ చెల్లింపు లింక్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ వాహనాలపై నిజంగా ట్రాఫిక్ చలాన్లు ఉంటే… తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ చలాన్ వెబ్‌సైట్‌కి వెళ్లి చెల్లింపులు చేసుకోవచ్చని సూచించారు. టీఎస్ ఈ-చలాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మన వాహనం నంబర్‌ను నమోదు చేయడం ద్వారా ఎన్ని చలాన్లు ఉన్నాయో చూపడంతో పాటు వాటిని క్లియర్ చేసే ఆప్షన్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి లింక్‌లు ఓపెన్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా సందేహాలుంటే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Chandrayaan 3:మసాలా దోశ, ఫిల్టర్ కాఫీ.. చంద్రయాన్ 3 సక్సెస్ వెనుక దాగున్న సీక్రెట్సా?

Show comments