NTV Telugu Site icon

ఆన్ లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం…

ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం చేసారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించిన చీటర్స్… అమాయక ప్రజలను ఆన్లైన్ బిజినెస్ పేరుతో టార్గెట్ చేసారు. చైనాకి చెందిన సైబర్ చీటర్స్ కి నకిలీ కంపెనీల పేరుతో కరెంట్ అకౌంట్స్ తీసి ఇచ్చారు హైదరాబాద్ వాసులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు ఓ వ్యక్తి. దాంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసాడు పోలీసులు.

చైనా వారికి కరెంట్ అకౌంట్ వీరి పేర్లతో సప్లై చేసిన అడబాల శ్రీనివాసరావు, నారాల విజయ్ కృష్ణ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు సైబర్ పోలీసులు ఈ అకౌంట్ లలో దాదాపు 15 కోట్ల వరకు ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చని అంచనాకు వచ్చిన పోలీసులు.. నిందితులని కస్టడీ తీసుకొని విచారిస్తే ఎన్ని కోట్లు వరకు ట్రాన్స్ఫర్ అయ్యాయని అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు అధికారులు. వీరి అకౌంట్ లో ఉన్న 19 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేసి, 21వేల నగదు, 2 మొబైల్స్, 5 చెక్ బుక్స్, 4 డెబిట్ కార్డ్స్, 5 రబ్బర్ స్టాంపులు సీజ్ చేసారు పోలీసులు.