NTV Telugu Site icon

Yadadri Bhuvanagiri: చిన్నారి ఊపిరి తీసిన రూ.5ల కాయిన్‌..

Kid Ded

Kid Ded

ఓ చిన్నారి ఆడుకుంటోంది. అక్క‌డ ఐదురుపాయ‌ల కాయిన్ క‌నిపించింది. అయితే ఆ చిన్నారి దానిని స్త నోట్లో వేసుకుంది. దీంతో అస్వ‌స్థ‌త‌కు గురైంది. గ‌మ‌నించిన త‌ల్ల‌దండ్రులు ప‌సిపాప‌ను వైద్యులు ద‌గ్గ‌రకు తీసుకు వెళ్లారు. వైద్యులు ఆకాయిన్ ను బ‌య‌ట‌కు తీసిన ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. చివ‌ర‌కు ఆ చిన్నారి ప్రాణాలు వ‌దిలింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోచోటుచేసుకుంది. కాగా.. భూదాన్‌ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. చిన్న కుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు రూపాయల కాయిన్ మింగేసింది.

read also: Varla Ramaiah : పాలకులు తమ చిత్త శుద్ది నిరూపించుకోవాలి

అయితే.. ఆ కాయిన్‌ గొంతులో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి చిన్నారి గొంతులోని కాయిన్ తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. చిన్నారి సోమవారం అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ నేప‌థ్యంలో.. తల్లిదండ్రులు చైత్రను అదే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే.. కాయిన్ ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్ సోకి చిన్నారి మరణించి ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారి చైత్ర ముద్దుముద్ద మాటలతో అల్లరి చేస్తూ ఆడుకుంటూనే అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

TTD : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్…ఒక్కరోజే రూ.6 కోట్లకు పైగా హుండీ ఆదాయం l