Site icon NTV Telugu

Hyderabad: నగరంలో కలకలం.. ఒకే రోజు నలుగురు అదృశ్యం..

Hyderabad Crime

Hyderabad Crime

Hyderabad: నగరంలో ఒకే రోజు నలుగురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వేరు వేరు ప్రాంతంలో ఇద్దరు బాలురు, ఒక యువతి, నవ వధువు అదృశ్యం కావడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఒకే రోజు నలుగు మిస్సింగ్ కేసులు నమోదు కావడంతో పోలీసులకు సవాల్ గా మారింది. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

జగద్గిరిగి గుట్టలో రోషన్ అనే పదేళ్ల బాలుడు అదృశ్యం అయ్యాడు. ఆడుకుంటానని తల్లిదండ్రులకు చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. ఎంతసేపటికి రోషన్ ఇంటికి రాకపోవడంతో భయాందోళన చెందిన తల్లిదండ్రులు బయటకు వెళ్లి చూడగా రోషన్ కనిపించలేదు. చుట్టుపక్కన వున్న వాళ్లను అడిగినా రోషన్ ను బయట చూడలేదని చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రోషన్ ను ధర్మవరం రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే రోషన్ ను ఎవరైనా తీసుకుని వెళ్లారా? లేక తనే ఇంటి నుంచి వెళ్లిపోయాడా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Read also: Cyber Crime: పోలీసులకు సైబర్‌ నేరగాళ్ల కుచ్చుటోపీ.. సీఐ బ్యాంకు ఖాతా ఖాళీ..!

ఇక మరో సంఘటన బాలానగర్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పదేళ్ల బాలుడు అదృశ్యం కావడం కాలనీ వాసులు భాయాందోళనకు గురవుతున్నారు. ఏపీహెచ్ బీ కాలనీలో తల్లి మందలించిందని కృతిక్ కళ్యాణ్ అనే పదేళ్ల బాలుడు సైకిల్ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్లి కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Read also: Renu Desai: ప్రధాని పక్కన నా కుమారుడు.. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను!

కాగా.. సూరారం పోలీస్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. సత్యవతి, రమణ దంపతుల కూతురు పార్వతి కనిపించకుండా పోయింది. దీంతో చుట్టు ప్రక్కల, బంధువుల ఇళ్లల్లో వెళ్లి వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు.

Read also:Priyanka Gandhi: నీట్ పరీక్ష ఫలితాలపై విచారణ జరిపించాలి.. కేంద్రంపై ప్రియాంక గాంధీ ఫైర్

ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన నెల రోజులకే నవ వధువు కనిపించకుండా పోవడంతో భర్త షాక్ తిన్నాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఖాజా బాగ్ లో నివాసముండే ముదావత్ సంతోష్ కి ముదావత్ అనితతో మార్చిలో వివాహం జరిగింది. సంతోష్ రోజూలాగేనే ఆఫీస్ కి బయలు దేరాడు. అయితే సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య ఇంట్లో కనిపించలేదు. అయితే.. పక్కనే ఎక్కడికైనా వెళ్లి ఉంటుందని కొద్దిసేపు ఇంట్లో సేద తీరాడు. ఎంతసేపటికి అనిత ఇంటికి రాకపోవడంతో.. బయటకు వచ్చిన సంతోష్ చుట్టుపక్కల, తెలిసిన బంధువుల ఇళ్లలో వెతికినా అనిత ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు, భర్త సంతోష్ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీనులు దర్యాప్తు చేస్తున్నారు.
Devendra Fadnavis: నేడు మోడీ, అమిత్ షాతో ఫడ్నవీస్ భేటీ.. రాజీనామాపై చర్చ..!

Exit mobile version