NTV Telugu Site icon

Rain Alert: నేటి నుంచి తెలంగాణలో నాలుగు రోజులు వానలు

Telangana Rains

Telangana Rains

Rain Alert: రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేటి (గురువారం) నుంచి ఈ నెల 19 వరకు అక్కడక్కడ తేలికపాటి లేదా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

Read also: KCR Protest: నేడు బీఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్త నిరసన.. శ్రేణులకు కేసీఆర్‌ పిలుపు

కొన్ని చోట్ల ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వాతావరణ కేంద్రం హెచ్చరికలతో వరుణ గండాన్ని ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో తుపాను ఏర్పడిందని వాతావరణ కేంద్రం తన ప్రకటనలో స్పష్టం చేసింది.

Read also: Bollywood Hero : భార్య పేరున్న టాటూను తొలగించిన హీరో..విడాకులు తీసుకోబోతున్నారా?

ఈరోజు (గురువారం) ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ సంగారెడ్డి, మహాబూబ్‌నగర్, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Read also: AP EAPCET: నేటి నుంచే ఏపీ ఈఏపీసెట్‌.. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ!

ఇక శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, వనపర్తి, వనపర్తి టి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 19, 20 తేదీల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.
Arvind Kejriwal: నేడు సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ