Site icon NTV Telugu

Swimming Deaths: యాచారంలో విషాదం…ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

Swim 1

Swim 1

ఈత సరదా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. దసరా సెలవులు రావడంతో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు..మరో కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ఈతకు వెళ్ళారు. వీరంతా చెరువులో పడి మరణించారు. విషయం తెలిసిన గ్రామస్తులు చెరువులోకి దిగి చనిపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమరిన్(14), ఖలేదు(12) రెహాన (10), ఇమ్రాన్ (9) లను మృతులుగా గుర్తించారు.

యాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో, ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అతని బంధువులు గొల్లగూడలోని దర్గాకు వెళ్లారు ప్రార్థన పూర్తయిన తర్వాత నలుగురు పిల్లలు
1) MD కహ్లీద్ s/o కాసిం, వయస్సు: 12 సంవత్సరాలు, Occ: 8 వ తరగతి, కులం: ముస్లిం,
2) కం. Md సమ్రీన్ D/o కాసిం, వయస్సు :14 yrs, Occ: 10వ ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు
3) Md. రెహాన్ s/ o రజాక్, వయస్సు: 10 అవును Occ: 5 వ తరగతి,
4) Sk ఇమ్రాన్ s/o హుస్సేన్ , వయస్సు: 09 సంవత్సరాలు ఈతకు వెళ్లారు.

వీరంతా గొల్లగూడ రెవెన్యూ పరిధిలోని ఎర్రకుంట ట్యాంక్‌ను సందర్శించి మార్గమధ్యంలో ఇంటికి తిరిగివస్తుండగా పై మృతులు చొక్కాలు తొలగించి ఈతలో పాల్గొన్నారు. ఈత కొట్టడం, నీటిలో మునిగిపోవడం ఎవరికీ తెలియదు. అనంతరం 2 గంటల సమయంలో గ్రామస్థుడు అనమోని కృష్ణయ్య వారి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. తదుపరి విచారణ నిమిత్తం వారి మృతదేహాలను ఓజీహెచ్ మార్చురీకి తరలించనున్నారు.

Read Also: US Senator: ఆధునిక భారతదేశంలో 1984 చీకటి సంవత్సరం
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్టీసీ బస్సు వెనక చక్రం కింద పడి బైక్ పై ప్రయాణిస్తున్న ఓ మహిళ మృతి చెందింది. చర్మాస్ ఎదురుగా ఘటన జరిగింది. సరుర్ నగర్ ప్రాంతానికి చెందిన మృతురాలు రమణమ్మ ( 48 ) అక్కడికక్కడే మృతి చెందింది. బస్సుని ఎడమ వైపు ఓవర్ టేక్ చేసింది బైక్..దీంతో అదుపు తప్పి బసు వెనక చక్రాల కింద పడి రమణమ్మ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also: BJP Satyakumar : రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు బేజారు కేంద్రాలుగా మారాయి

Exit mobile version