కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని గోదావరిఖని గంగా నగర్ ఏరియాలో లారీ డ్రైవర్ ను కత్తితో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురిని డీసీపీ రవీందర్ అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 9 వేల నగదు, ఏటీఎం కార్డులు, కత్తి, బైక్ ను వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు చాకచక్యంగా చేధించిన వన్ టౌన్ సీఐలు రమేష్ బాబు, రాజ్ కుమార్ గౌడ్, పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు.
గోదావరిఖనిలో బెదిరించి డబ్బులు వసూలు.. నలుగురు అరెస్ట్
