TS sheep Scam: గొర్రెల పంపిణీ పధకంలో స్కాంలో కేసును ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీ అక్రమాల్లో ఏసీబీ నలుగురు అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో రూ. 2.10 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు. గొర్రెల కొనుగోలుదారులకు డబ్బులు చెల్లించకుండా దళారుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు నిర్ధారించారు. ఇందులో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను కస్టడీలోకి తీసుకోనున్నారు. దీంతో మూడో రోజులు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. ఈరోజు నుంచి మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించనున్నారు.
ఇవాళ్టి నుంచి మార్చి 2 తేదీ వరకు కస్టడీకి కోర్టు అనుమతించింది. మూడో రోజల కస్టడీలో నిందితుల నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈకేసులో మరికొందరి పాత్ర ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ లను అరెస్ట్ చేశారు. రైతులకు ఇవ్వాల్సిన 2.10 కోట్లు నగదు బినామీ పేర్లతో వివిధ ఖాతాలకు మళ్లించాలని గుర్తించారు.
Read also: Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ..
నలుగురు నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో ఫిబ్రవరి 22న హాజరుపరచగా మార్చి 7వ తేదీ వరకు రిమాండ్ విధించగా.. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. గొర్రెల పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్రంలోని యాదవ, కురుమ సంఘాలకు ప్రభుత్వం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసేందుకు తీసుకొచ్చారు. విడతల వారీగా సబ్సిడీ గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే ఈ పథకంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై గచ్చిబౌలిలో కేసు నమోదైంది.
గచ్చిబౌలి పోలీసులు కేసును ఏసీబీకి బదిలీ చేశారు. ఏసీబీ రంగ ప్రవేశంతో ఈ కుంభకోణం పక్కదారి పట్టింది. పథకంలో కీలకపాత్ర పోషించిన అధికారులు, కాంట్రాక్టర్లను విచారిస్తోంది. అలాగే రికార్డులను పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరిస్తోంది. కాగ్ నివేదిక కూడా ఈ పథకంలోని పలు అంశాలను ప్రస్తావించింది. ఈ వివరాలను కూడా ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. తాజాగా నలుగురిని అరెస్ట్ చేయడంతో.. వారిని కూడా కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ యోచిస్తోంది. రానున్న రోజుల్లో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్ కేసు.. అబ్బాస్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు