Formula E Racing: ఫార్ములా రేసింగ్, ఈ పేరు వినగానే చాలా మందికి బుల్లెట్లలా దూసుకుపోతూ, స్పీడ్ కంట్రోల్ లేకుండా మలుపులు తిరిగే కార్లు గుర్తుకొస్తాయి. ఇన్నాళ్లు టీవీల్లో ఎంజాయ్ చేస్తున్న ఫార్ములా రేసింగ్ నేటి నుంచి హైదరాబాద్ లో జరగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఫార్ములా-ఇ’ రేస్ ఈరోజు ప్రాక్టీస్ మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. అంతర్జాతీయ పోటీలతో ‘ఫార్ములా-ఇ’ రేసు హుస్సేన్‌సాగర్ తీరాన్ని అలరించనుంది. ఇప్పటివరకు విదేశాల్లో కనిపించే రేసులను నగరవాసులకు వీక్షించే అవకాశం లభిస్తుంది.హుస్సేన్‌సాగర్ ఒడ్డున జరిగే అంతర్జాతీయ పోటీల కోసం 2.8 కి.మీ స్ట్రీట్ సర్క్యూట్‌ను ఏర్పాటు చేశారు. లుంబినీ పార్క్ నుంచి ప్రారంభమైన ఈ రేస్ మింట్ కాంపౌండ్, ఐమాక్స్ మీదుగా సచివాలయం వైపు నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు సాగనుంది.
Read also: Pocharam Srinivas Reddy: అందుకే జన్మదిన వేడుకలు రద్దు చేశాను.. కంట తడి పెట్టిన పోచారం..
రేపు (శనివారం) జరిగే ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేసుకు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ భారతదేశపు మొట్టమొదటి ఫార్ములా E రేసు హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న 2.8-కిమీ ట్రాక్‌పై జరుగుతుంది. ఇందులో మొత్తం 18 మలుపులు ఉన్నాయి. 20,000 మంది ప్రేక్షకులు రేసును చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. నాలుగు రకాల టిక్కెట్లు ఉన్నాయి. రూ. 1,000 ధర కలిగిన గ్రాండ్‌స్టాండ్ టిక్కెట్‌లు మరియు రూ. 4,000 ధర కలిగిన గ్రాండ్‌స్టాండ్ టిక్కెట్‌లు ఇప్పటికే విక్రయించబడ్డాయి. ప్రీమియం గ్రాండ్‌స్టాండ్ – రూ. 7,000, ఏస్ గ్రాండ్‌స్టాండ్ ధర రూ. 10,500 టిక్కెట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. 1.25 లక్షల ఏస్ లాంజ్ ప్యాకేజీ కూడా ఉంది. ఫార్ములా E మరియు ఇతర మోటార్‌స్పోర్ట్‌ల మధ్య ప్రధాన వ్యత్యాసం కార్లు. అన్ని కార్లు ఎలక్ట్రిక్, 250kW బ్యాటరీతో నడిచేవి. ఇవి గంటకు 280 కి.మీ. పూర్తి వేగంతో పరుగెత్తేటప్పుడు కార్ల శబ్దం స్థాయిలు 80 డెసిబుల్స్ మాత్రమే. ఈ కార్లకు హైబ్రిడ్ టైర్లను ఉపయోగిస్తారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ నడిచేలా ఈ కార్లను రూపొందించారు. ఈ ఫార్ములా ఇ రేస్‌లో 11 జట్లు, 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు.
Lithium Reserves: దేశంలో తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో బయటపడిన లిథియం నిల్వలు..