నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీజేపీ హయాంలో ఈడీ నోటిసులు కామన్ అయ్యాయని ఎద్దేవా చేశారు. ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఇప్పటి వరకు ఈడీ నోటీసులు రాలేదని అన్నారు. కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడే బీజేపీ ఈడీ నోటీసులు ఇవ్వడం లేని ఆయన అన్నారు. ఇక్కడే బీజేపీ, టీఆర్ఎస్ దోస్తీ అర్థం అవుతుందని విమర్శించారు.
తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అయిందని.. ఇన్నాళ్లు రాష్ట్రాన్ని పట్టించుకోని బీజేపీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో పొన్నం విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును వక్రీకరించిన మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పొన్నం విమర్శించారు. తల్లిని చంపి, బిడ్డను బతికించారని చెప్పిన మోదీకి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఆవిర్భావాని కన్నా ముందే 8 మండలాలను ఆంధ్రలో కలిపింది బీజేపీ పార్టీ అని అన్నారు.
మతాలను రెచ్చగొట్టి చిన్నాభిన్నం చేస్తోందని.. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల పేరుతో చరిత్ర వక్రీకరణ చేస్తుందని విమర్శించారు. గాంధీ కుటుంబం పేరు లేకుండా చేయాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో లేని వాళ్లు చరిత్రను మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. 105 సీట్లలో డిపాజిట్ లేని వాళ్లతో మాకు పోటీ ఎక్కడ అని.. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ తోనే పోటీ అని అన్నారు పొన్నం. మసీదు కూల్చాలని బండి సంజయ్ మాటలు సరికాదని.. ఆయన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఈడీ సమన్లపై మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి కూడా స్పందించారు. రాహుల్, సోనియా గాంధీకలు ఈడీ నోటీసులు ఇవ్వడంలో ఆశ్యర్యం లేదని ఆమె అన్ారు. ఉద్దేశపూర్వకంగానే నోటీసులు ఇచ్చారని.. కేసులు పెట్టి వేధించాలని బీజేపీ అనుకుంటుందని విమర్శించారు. గాంధీ కుటుంబంలో భయపడేది అనేది ఉండదని ఆమె అన్నారు.
