Site icon NTV Telugu

MLA Shanampudi: ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారు.. సైదిరెడ్డి ఆడియో వైరల్..

Mla Shanampudi

Mla Shanampudi

MLA Shanampudi: తనకు ఇష్టం లేకున్నా.. బలవంతంగా బీజేపీలో చేరానని హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయనే స్వయంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. పార్టీ నేతలందరూ తనకు సపోర్టుగా నిలబడాలని కోరారు. ఇష్టంగా వెళ్లలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: Anil Ambani: ముంబై మెట్రోలో రూ.4000కోట్ల వాటాను విక్రయించనున్న అనిల్ అంబానీ

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అవుతుంది. ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారు. ఎంపీ టికెట్ నీకే వస్తుందన్నారని తెలిపారు. ఇప్పుడు కండువా కప్పుకోకుంటే పార్టీ పరువు పోతుందన్నారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీనే వస్తుందన్నారు. మోడీ ప్రధాని అవుతారన్నారు. ఎన్నికలపుడు డబ్బులు ఇవ్వకుండా అవతల వారికి ఇస్తే ఎలా పని చేస్తామన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అర్ధం కావడం లేదన్నారు. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి పోటీ చేయడం లేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటున్నారని తెలిపారు. పార్టీ మారినందుకు క్షమించండి అంటూ తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నారు.

Read also: Guntur: అత్తింటి వేధింపులు, అప్పుల బాధతో ఓ కటుుంబం ఆత్మహత్యయత్నం..

మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాంనాయక్‌, గొడం నగేశ్‌, హుజూర్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో నలుగురు బీజేపీలో చేరారు. వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నాయకులు లక్ష్మణ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో.. సైదిరెడ్డి ఆడియో మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
Weight Loss Tips: నానబెట్టిన శనగల నీటిని తాగితే బరువుతగ్గడంతో పాటు ఆ సమస్యలు దూరం..

Exit mobile version