NTV Telugu Site icon

Malla Reddy Arrest: పోలీసుల అదుపులో మల్లారెడ్డి.. తీవ్ర ఉద్రిక్తత..

Mallareddy

Mallareddy

Malla Reddy Arrest: కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లార్‌రెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఇవాళ వాగ్వాదానికి దిగారు. అయితే ఆ స్థలం తమదేనంటూ కొందరు వారిద్దరినీ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. స్థానిక సమాచారంతో పోలీసుల రంగ ప్రవేశం చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై మాల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అదుపులో తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు.

Read also: TS EAPCET Results 2024: ఏపీ విద్యార్థులదే మొదటి ర్యాంకు.. టాప్‌ లిస్ట్‌ ఇదే..

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూమి కోర్టు వివాదంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి-రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో ఉన్న రెండున్నర ఎకరాల భూమి తమదేనని మల్లారెడ్డి పేర్కొనగా, మిగిలిన 15 మంది 1.11 ఎకరాలు తమదని, ఒక్కొక్కరు 400 గజాలు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందన్నారు.

Read also: Ganja Gang: నగరంలో గంజాయి గ్యాంగ్ హల్ చల్.. యువకులపై కత్తులతో దాడి

ఈ క్రమంలో ఇరువర్గాలకు పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే మల్లారెడ్డి పోలీసుల మాట వినకుండా.. ఆయన అనుచరులను ఫెన్సింగ్ నుంచి తప్పించాలని అన్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా అంటూ మల్లారెడ్డి పోలీసులతో చెప్పడంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82 భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్లారెడ్డి అరెస్ట్ తో బీఆర్ఎన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నారు. దీంతో అక్కడి భారీగా పోలీసులు మోహరించారు. ఎవరికి లోనికి అనుమతిచడం లేదు.

TS EAPCET Results 2024:ఎంసెట్ రిజల్ట్ ఫాస్ట్ గా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Show comments