NTV Telugu Site icon

MP Ranjith Reddy: నాపై ఎందుకు కేసు పెట్టారో విశ్వేశ్వర్ రెడ్డి నే అడగండి : రంజిత్ రెడ్డి

Mp Ranjith Reddy

Mp Ranjith Reddy

MP Ranjith Reddy: తనపై ఎందుకు కేసు పెట్టారో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి నే అడగాలని బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కే పరిమితం అవుతుందా? పూర్తి స్థాయి సమావేశాలు నిర్వహిస్తుందా చూడాలన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే బిఆర్ఎస్ ఉందన్నారు. తెలంగాణకు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తామ్నారు. కాగా రంజిత్ రెడ్డిపై మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదుపై స్పందించారు. తనపై ఎందుకు కేసు పెట్టారో మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి నే అడగాలని సూచించారు. విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడాక తను స్పందిస్తానని క్లారిటీ ఇచ్చారు. నా 60 ఏళ్ల జీవితంలో ఇప్పటి వరకు ఒక్క ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు కాలేదన్నారు. నాకు సంస్కారం ఉందన్నారు.

Read also: Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు ఆటో ఢీ.. 12 మంది మృతి

చేవెళ్ల బీఆర్ఎస్ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు రంజిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 17న బంజారాహిల్స్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఫోన్ చేశారు. తమ పార్టీ నేతలను ఎందుకు కలుస్తున్నారంటూ రంజిత్ రెడ్డి తనతో అసభ్యంగా మాట్లాడారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి 20న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎంపీ రంజిత్ రెడ్డి తనను దూషించారని, ఫోన్‌లో బెదిరించారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఫిర్యాదు సందర్భంగా తనను బెదిరించిన వ్యక్తి ఎవరో విశ్వేశ్వర్ రెడ్డి మీడియాకు వెల్లడించలేదు. రంజిత్ రెడ్డి పేరును పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉండగా, అదే స్థానం నుంచి ఎంపీ రంజిత్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో స్థానికంగా పట్టు నిలుపుకునేందుకు నేతలిద్దరూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
TSPSC Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి.. గవర్నర్ ఆమోదం..