NTV Telugu Site icon

Father Died: నాన్న నువ్వు ఉంటే ఎంతో సంతోషించేవాడివి.. ఓ కూతురి ఆవేదన

Forest Ranger Srinivasa Rao

Forest Ranger Srinivasa Rao

Forest Ranger Srinivasa Rao: ఆచిన్నారి క్రీడల్లో సత్తాచాటి రెండు పతకాలు సాధించింది. ఆమెడల్స్‌ అందుకుంటుండగా ఆ చిన్నారి కంట్లోంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఆ కన్నీరు పథకాలు గెలిచాననే సంతోషంతో వచ్చాయి అనుకుంటే పొరపాటే.. తన నాన్న స్పూర్తితో క్రీడల్లో పోటీచేసింది కానీ.. నాన్న పథకాలు అందుకుంటున్నప్పుడు తన వద్ద లేనందుకు తలుచుకుని కన్నీరు కార్చించి. తండ్రి బతికుంటే ఆనంద పడేవారని ఆయన ఇక లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని బాధతో కన్నీరు రాలినవి. ఇంతకూ ఆ చిన్నారి తండ్రి ఎవరు? అనుకుంటున్నారు. ఈనెల 21వ తేదీ గుత్తికోయల దాడిలో మృతిచెందిన ఫారెస్ట్ రేంజర్స్ శ్రీనివాసరావు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కృతిక.

Read also: Cirkus: మొదటిసారి డ్యూయల్ రోల్ లో రణవీర్ సింగ్

కొత్తగూడెంలోని కార్పొరేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. రెండళ్లుగా అథ్లెంటిక్స్‌లో కఠోర శిక్షణ పొందుతోంది. తండ్రి చనిపోయిన బాధ మనసును తొలుస్తన్నా శుక్రవారం కొత్తడూగెం జిల్లా చందుచుపల్లి మండలం రుద్రంపూర్‌ లో నిర్వహించిన అథ్లెంటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ జిల్లా స్థాయి సంబ్‌ జూనియర్‌ పోటీల్లో కృతిక పాల్గొని సత్తా చాటింది. అండర్-10 విభా గంలో లాంగ్లింప్ స్వర్ణం.. 100 మీటర్ల పరుగులో రజతం కైవసం చేసుకుంది. నిత్యం సింగరేణిలోని ప్రకాశం మైదానానికి కూతురును ఆయనే స్వయంగా తీసుకొ చ్చేవారు. ఐదురోజుల క్రితం కూడా తండ్రి, తనను మైదానానికి తీసుకొచ్చి దగ్గరుండి ప్రాక్టీసు చేయించారని.. కొన్ని మెళకువలు చెప్పారని కృతిక గుర్తు చేసుకుంది. ఎన్నికష్టాలొచ్చినా మనో ధైర్యంతో చివరి క్షణం దాకా పోరాడితేనే ఏ పోటీలోనైనా నెగ్గుతావు అంటూ తండ్రి తనతో చెప్పేవారని పేర్కొంది. డిసెంబరు 5, 6 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు, చిన్నారి మరో స్థైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. పతకం అందుకుంటున్న సమయంలో తండ్రిని గుర్తుచేసుకొని రోదించడం అక్కడున్నవారిని కలిచివే సింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామపంచాయతీ పరిధిలోని ఆదివాసి గూడెం అయిన ఎర్రబోడు గ్రామంలో మడకం తుల తను సాగు చేసుకుంటున్న పోడు భూములలో చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ ప్లాంటేషన్ మొక్కలు వేశాడు. ఈరోజు ఉదయం రోజులాగానే తన పొలంలో పశువుల మేపుతున్న క్రమంలో అటువైపు వెళుతున్న ఫారెస్ట్ రేంజర్స్ శ్రీనివాసరావు, సెక్షన్ ఆఫీసర్ రామారావు మడకం తులాను హెచ్చరించటంతో అక్కడ చోటు చేసుకున్న గొడవ కాస్త ఘర్షణకు దారి తీయడంతో ఆవేశంతో తన చేతిలో ఉన్న కోడవలతో శ్రీనివాసరావుపై దాడి చేయగా అక్కడి నుంచి తప్పించుకున్న సెక్షన్ ఆఫీసర్ రామారావు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయాలు ఆయ్యాయి. శ్రీనివాసరావుకు ఒళ్లంతా రక్తస్రావం అయింది. కొత్తగూడెం నుంచి ఖమ్మం తరలించారు. అయితే అక్కడ శ్రీనివాసరావు చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే..
Bharat Biotech: బూస్టర్‌ డోస్‌గా భారత్ బయోటెక్‌ చుక్కల మందు టీకా