NTV Telugu Site icon

నిలోఫర్‌లో ‘డైట్‌’ స్కామ్.. కాంట్రాక్టర్‌ అరెస్ట్..

Niloufer

Niloufer

ప్రభుత్వ చిన్నపిల్లల ఆస్పత్రి నిలోఫర్‌లో భారీ స్కామ్‌ వెలుగు చూసింది.. చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామంటూ.. డబ్బులు లొక్కేశాడు కాంట్రాక్టర్‌.. అసలు నాణ్యమైన ఆహారం అందించకుండానే.. తప్పుడు బిల్లులు పెట్టి రూ.1.20 కోట్లు డ్రా చేశాడు డైట్‌ కాంట్రాక్టర్‌ సురేష్‌ బాబు.. దీనిపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన సీసీఎస్‌ పోలీసులు.. తప్పుడు బిల్లులతోనే రూ. 1.20 కోట్లు కాజేసిన‌ట్లు విచారణలో తేలడంతో.. సురేష్‌ బాబును అరెస్ట్ చేశారు.. డైట్‌ కాంట్రాక్టర్‌ సురేష్‌పై గత కొన్నాళ్ల నుంచి ఆరోపణలు వచ్చాయి.. అవి నిలోఫర్‌ సూపరింటెండెంట్‌ దృష్టికి రావడంతో.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో.. ఈ గుట్టు బయటపడింది. చిన్నారులు పెట్టాల్సిన హై ప్రొటీన్‌ ఫుడ్‌ లో కూడా ఇలాంటి స్కామ్‌లపై మండిపడుతున్నారు ప్రజలు.