Wanaparthy: వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం విద్యార్థినులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. విద్యార్థునిలను పాఠశాల యాజమాన్యం ఆత్మకూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిన్న ఆహారంతోనే ఫుడ్ పాయిజన్ అయ్యిందని విద్యార్థినిలు తెలిపారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు అధికారులు. హుటా హుటిన తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకుని విద్యార్థినుల పరిస్థితి చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలు బాధతో కడుపు పట్టుకుని ఏడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం కారంగానే తమ పిల్లలకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుప్రతి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: Pooja Hegde : వైట్ పూల డ్రెస్సులో టెంప్ట్ చేస్తున్న పూజా హెగ్డే..
తాజాగా మహబూబాబాద్ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో ఫుడ్ పాయిజన్ కారణంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాత్రి భోజనానికి తయారు చేసిన టమోటా వంటకం తినడం వల్ల దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థులు, సంబంధిత విద్యాలయం వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేజీబీవీ అధికారులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
LIC: ఎల్ఐసీ ఆస్తులు 45 లక్షల కోట్లు.. కంపెనీ మీ డబ్బుతో ఏమి చేస్తుంది?