NTV Telugu Site icon

Flexi in Jagityal: చిట్టీల వ్యాపారీ ఆచూకీ చెబితే రూ.3 లక్షల నగదు.. జగిత్యాలలో వెలసిన ఫెక్సీ

Jagityala

Jagityala

Flexi in Jagityal: చిట్టీల పేరుతో ఎన్ని మోసాలు, దోపిడీలు చేసినా ప్రజలు చిట్టీలు వేయడం మానడం లేదు. ఇంట్లో ఏదైనా ఖర్చు పెట్టవచ్చన్న ఆశతో రూపాయి.. రూపాయి పొదుపు చేసి డబ్బులు కడుగుతుంటారు. అయితే ఇదే అలుసుగా భావించిన కొందరు కేటుగాళ్లు.. చాలా ప్రాంతాల్లో చిట్టీల పేరుతో డబ్బులు దండుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మోసాల బారిన పడిన కొందరు బాధపడుతుంటే.. మరికొందరు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మరికొందరు వారి కసితీరేలా అతను ఎక్కడున్న ముందుకు వచ్చేలా కొత్త ఐడియాలు చేస్తున్నారు. వారు చేస్తున్న పని చూస్తే.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అనిపిస్తుంది. అతని పేరును నెంబర్లతో సహా ప్లెక్సీ పెట్టడంతో చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు కొందరు నాయకులు ఆయా ప్రాంతాల్లో పని చేయకున్నా.. ప్రజలకు అందుబాటులో లేకుంటే.. కనిపించడం లేదంటూ స్థానికులు పోస్టర్లు వేసి నిరసన తెలుపుతుంటారు. అయితే ఇప్పుడు చిట్టీ వ్యాపారి పేరుతో పోస్టర్లు వెలిశాయి.^మోసం చేశాడంటూ ఆపోస్టర్‌ పై రాసి నెబర్లతో సహా ప్రింట్‌ వేయించి ప్లెక్సీని కట్టారు.

Read also: Sharad Pawar: అందుకే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు..

ఇంతకీ ఆ పోస్టర్‌ ఎక్కడో కాదండోయ్‌ జగిగ్యాల జిల్లాలోని గోవిందు పల్లెలో వెలసింది. తమ వద్ద చిట్టీలు కట్టించుకుని డబ్బులతో పరారైన ‘గాండ్ల వెంకన్న’ అనే వ్యక్తి ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేసిన జగిత్యాలలో రోడ్లమీద ఏర్పాటుచేశారు. గాండ్ల వెంకన్న అనే వ్యక్తి కనబడుటలేదు అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అయితే..పై ఫోటోలోని వ్యక్త పేరు గాండ్ల వెంకన్న ఈ వ్యక్తి పెద్ద మొత్తంలో డ్బుబలు తీసుకుని కుటుంబంతో సహా పరార్ అయ్యాడు. ఆచూకి తెలిపినవారికి రూ.3 లక్షలు బహుమతి ఇస్తాం అంటూ ప్రకటించారు బాధిత మహిళలు. ఫ్లెక్సీలో బాధిత మహిళల ఫోన్ నంబర్లు కూడా ప్రింట్ చేయించారు. ఈ వ్యక్తి ఆచూకి తెలిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయమని కోరు వారి ఫోన్ నంబర్లు ముద్రించారు. ఫోన్ చేయండీ రూ.3లక్షలు గెలుచుకోండి అంటూ ఫ్లెక్సీలో రాయించారు. దీంతో అతను ఎక్కడున్న పట్టుబడటం ఖాయమంటున్నారు బాధితులు. మరి మోసపోయిన బాదితులకు పోలీలసులు న్యాయం చేస్తారా? లేక ప్రజలే వెంకన్నను పట్టుకుని తగిన బుద్దిచెబుతారా? అనే పరిస్థితి నెలకుంది.