NTV Telugu Site icon

FISH Lorry: చేపల లారీ బోల్తా.. క్షణాల్లో చేపలు మాయం

Fish 1

Fish 1

రోడ్లమీద లారీలు భారీ లోడ్ తో వెళుతుంటాయి. డ్రైవర్ నిర్లక్ష్యమో.. రోడ్డు మీద సమస్య వల్ల లారీలు బోర్లాపడుతుంటాయి. ఆ లారీల్లో బీరు బాటిళ్ళు, సెల్ ఫోన్లు, చేపల లోడ్ వి అయితే సమీప ప్రాంతాల ప్రజలకు పండగే పండుగ. తాజాగా భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద అదుపు తప్పి చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. ఘటనస్థలానికి భారీగా తరలివచ్చిన జనం పండుగ చేసుకున్నారు. నిమిషాల్లో లారీ లోడ్ చేపల్ని మాయం చేసేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద ఈరోజు తెల్లవారుజామున చేపల లోడుతో వెళ్తున్నలారీ అదుపు తప్పి ప్రధాన రహదారిపైన బోల్తాపడింది, ఉదయం ఆరుగంటల సమయానికి ఈవిషయం చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో జనం భారీగా ఘటనా స్థలానికి చేరుకొని చేపల కోసం ఎగబడ్డారు.

చేతికి అందిన చేపలను ఎత్తుకెళ్లారు. కొందరైతే బస్తాల కొద్దీ చేపలు పట్టుకుపోయారు. దీంతో ప్రధాన రహదారి అంతా జాతరను తలపించింది. చేపల కోసం జనం తరలిరావడంతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జాం అయింది. విషయం తెలుసుకున్న పోలసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకుని ట్రాఫిక్ ని పునరుద్ధరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం వైపు లారీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం..