Site icon NTV Telugu

భద్రాచలం ‌వద్ద‌ మొదటి ‌ప్రమాద‌ హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ సూచించారు. ఎగువన కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి, లక్ష్మీ బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతో్ంది. దీంతో గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇక అటు వరంగల్‌ నగరాన్ని మరోసారి వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి.

ఏకధాటిగా కురిసిన వర్షాలకు నగరం చిగురుటాకుల వణికిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద నుంచి కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇళ్లకు వర్షపు నీరు పోటెత్తడంతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసినా.. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాంటి సాయం అందించడం లేదని ఆరోపిస్తున్నారు నగరవాసులు. గతేడాది కూడా వరదకు ఓరుగల్లు నగరం అతాలకుతమైంది. ఫ్లడ్‌ ఎఫెక్ట్‌తో నగరంలోని కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కొనసాగుతూనే ఉంది.

Exit mobile version