NTV Telugu Site icon

Fire Accident: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు.. రామాంతపూర్‌ ఫర్నీచర్‌ గోడౌన్‌లో..

Fire Accident

Fire Accident

Fire Accident: గత కొంతకాలంగా హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వరుస అగ్ని ప్రమాదాలను నగరవాసులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ ఉదయం మరో అగ్ని ప్రమాదం కలకలం రేపుతుంది. హైదరాబాద్‌ రామంతపూర్‌లోని ఓ ఫర్నీచర్‌ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్‌ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అయితే..ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే.. భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయ భ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థకాలేదు. భారీ మంటలు చలరేగడంతో సంఘటనా స్థలంలో ఎవరిని అనుమతించలేదు. రోడ్డులన్నీ బ్లాక్‌ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు.

Read also: Mulugu Accident: కరెంట్‌ స్థంభానికి ఢీ కొట్టిన ఆటో.. స్పాట్‌ లోనే మహిళ మృతి..

గత నెలలో సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేటలోని డెక్కన్‌ మాల్‌ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా చిక్కడపల్లి వీఎస్టీ సమీపంలోని ఓ గోదాములో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. అలాగే తెలంగాణ కొత్త సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం కలకలం రేపింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. మాల్‌ ను కూల్చివేశారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే అందులో ఇంకా ఇద్దరి జాడ మాత్రం పశ్నార్థంగానే మారడంతో చర్చకు దారిదీసింది.
Harassing: బల్దియా ఉద్యోగినిపై వేధింపులు.. మహిళలు లేని చోటుకు ట్రాన్స్ ఫర్‌ చేయాలని..