Fire accident: కుషాయిగూడలో అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire accident: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్, శాస్త్రీపురం, నాచారంలో జరిగిన వరుస అగ్నిప్రమాద ఘటన మరువక ముందే ఇక తాజాగా మరోసారి కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున టింబర్ డిపోలో మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవదహనమయ్యారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగ కమ్మేయడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బందికి ఇబ్బంది ఎదుర్కొన్నారు.
Read also: Atik Ahmad: అతీక్ అహ్మద్ హత్య.. మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్తుండగా..
నగరంలోని కుషాయిగూడలోని కలప డిపోలో ఈరోజు తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. చూస్తుండగానే భారీగా మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి. దీంతో చిన్న కొడుకుతో పాటు అక్కడే నివసిస్తున్న దంపతులు చనిపోయారు. బంధువుల ఇంట్లో పడుకున్న పెద్ద కొడుకు సురక్షితంగా బయటపడ్డాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులను నరేష్ (35), సుమ (28), జోషిత్ (5)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల వివరాలను ఇంకా తెలియాల్సి ఉంది.
LSG vs PBKS: లక్నోపై పంజాబ్ కింగ్స్ సంచలన విజయం.. లాగేసుకున్నారుగా!
Also Read
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!