Site icon NTV Telugu

Hyderabad Fire Accident: నగరంలో అగ్ని ప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు

Rajendranagar

Rajendranagar

Hyderabad Fire Accident: హైదరాబాద్ లో రెండు వేరు వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంది. గోశామహల్, రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. భారీగా శబ్దం రావడంతో ప్రజలకు భయంతో పరుగులు తీశారు. గోశామహల్ లో ఓ ప్లైఉడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోశామహల్ దారుసలం, గౌస్పురా లోని బాలాజీ ప్లైఉడ్ గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సమాచారంతో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్కుట్ తో చెలరేగిన మంటలుగా అనుమానిస్తున్న ఫైర్ సిబ్బంది. 4 ఫైర్ ఇంజన్ల తో మంటలు అదుపు చేస్తున్నారు. లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లుగా చెబుతున్నారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది.

మరోవైపు రాజేంద్రనగర్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్ర నగర్‌లోని సన్‌సిటీలోని ఓ బాణసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున మూడు గంటలకు మంటలు చెలరేగడంతో ప్రమాదం తీవ్రంగా మారింది. అయితే ప్రాణనష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయితే పటాకుల షాపు పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్, పాన్ షాప్, టీ షాపులో మంటలు చెలరేగాయి. ఇవి పూర్తిగా కాలిపోయాయి. అర్థరాత్రి 12 గంటల వరకు క్రాకర్స్ ప్యాక్ చేసి పడుకున్నారు. అయినా సరే… దుకాణం కాస్త కదిలింది. రాత్రి 3 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటల వేడి, పొగలు రావడంతో షాపులో ఉన్న వ్యక్తులు మేల్కొని తప్పించుకున్నారు. అయితే ఈ పటాకుల దుకాణాన్ని టెంట్ హౌస్ గోదాములోని రేకు షెడ్డులో ఏర్పాటు చేశారు. దీంతో టెంట్ హౌస్‌కు చెందిన గోదాము పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Traffic Diversions: నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Exit mobile version