Hyderabad Fire Accident: నగరంలో అగ్ని ప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Fire Accident: హైదరాబాద్ లో రెండు వేరు వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంది. గోశామహల్, రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. భారీగా శబ్దం రావడంతో ప్రజలకు భయంతో పరుగులు తీశారు. గోశామహల్ లో ఓ ప్లైఉడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోశామహల్ దారుసలం, గౌస్పురా లోని బాలాజీ ప్లైఉడ్ గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సమాచారంతో హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్కుట్ తో చెలరేగిన మంటలుగా అనుమానిస్తున్న ఫైర్ సిబ్బంది. 4 ఫైర్ ఇంజన్ల తో మంటలు అదుపు చేస్తున్నారు. లక్షల్లో ఆస్తినష్టం జరిగినట్లుగా చెబుతున్నారు. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది.
మరోవైపు రాజేంద్రనగర్‌లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్ర నగర్‌లోని సన్‌సిటీలోని ఓ బాణసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున మూడు గంటలకు మంటలు చెలరేగడంతో ప్రమాదం తీవ్రంగా మారింది. అయితే ప్రాణనష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. అయితే పటాకుల షాపు పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్, పాన్ షాప్, టీ షాపులో మంటలు చెలరేగాయి. ఇవి పూర్తిగా కాలిపోయాయి. అర్థరాత్రి 12 గంటల వరకు క్రాకర్స్ ప్యాక్ చేసి పడుకున్నారు. అయినా సరే… దుకాణం కాస్త కదిలింది. రాత్రి 3 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటల వేడి, పొగలు రావడంతో షాపులో ఉన్న వ్యక్తులు మేల్కొని తప్పించుకున్నారు. అయితే ఈ పటాకుల దుకాణాన్ని టెంట్ హౌస్ గోదాములోని రేకు షెడ్డులో ఏర్పాటు చేశారు. దీంతో టెంట్ హౌస్‌కు చెందిన గోదాము పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!