Site icon NTV Telugu

Fire Accident: మాదాపూర్ ఐటీ కంపెనీలో అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు..

Madhapur Fir Accident

Madhapur Fir Accident

Fire Accident: మాదాపూర్ లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐదు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానిక సమాచారంతో సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

Read also: Samsung Galaxy S25: గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం అదిరిపోయే మొబైల్స్‌ను విడుదల చేయనున్న సామ్‌సంగ్

మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్వ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ భవనంలో అనేక ఐటీ కంపెనీలు, రెస్టారెంట్లు ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున 5 అంతస్తుల బిల్డింగ్ లోని ఓ రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి పక్కన ఉన్న కంపెనీల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో పక్క కంపెనీలో ఉన్న ఐటీ ఉద్యోగులు కొందరికి గాయాలయ్యాయి.

పేలుడు సంభవించిన రెస్టారెంట్ కి ఎదురుగా విరాట్ కోహ్లీ కి చెందిన రెస్టారెంట్ కూడా ఉంది. సత్వ భమనంలోని సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటా హుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. కంపెనీలో ఉన్న ఉద్యోగులందరినీ బయటకు తీసుకుని వచ్చారు. అక్కడున్న వారందరిలో పలువురి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.బిల్డింగ్ నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది ప్రయాత్నాలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ పూర్తిగా తగలబడుతుంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Ghaati : డ్రగ్ మాఫియా సామ్రాజ్యానికి లేడీ బాస్‌గా అనుష్క.. వయలెన్స్ వేరే లెవల్

Exit mobile version