Fair Accident: తెలంగాణ రాష్ట్ర రాజధాని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ శివరాంపల్లి సమీపంలోని స్క్రాప్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బయటకు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున మంటలు చలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఎవరికి ఎటువంటి హానీ జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read also: TS Rains: తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరికలు
రాజేంద్రనగర్‌లో సెప్టెంబర్ 1న భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రాజేంద్రనగర్‌లోని డైరీ ఫామ్ చౌరస్తాలోని గ్రీన్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. సెల్లార్‌లో పార్క్ చేసిన వాహనాలన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటల్లో సెల్లార్‌లోని 9 ద్విచక్ర వాహనాలు, ఒక కారు దగ్ధమయ్యాయి. గ్రీన్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని వాచ్‌మెన్ కుటుంబం రాఖీ పండుగ కోసం బంధువుల ఇంటికి వెళ్లారు. మంటలు ఎలా చెలరేగాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది.
Astrology: సెప్టెంబర్ 7, గురువారం దినఫలాలు
