Fire accident is due to doing work without quality – Bandi Sanjay: నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం మన్నారు. సీఎం పుట్టిన రోజునే (ఫిబ్రవరి 17న) కొత్త సచివాలయ ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని కోరారు. ఫైర్ సేఫ్టీసహా అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Read also: Fire in New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
ప్రారంభానికి సిద్ధమవుతున్న తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.. సచివాలయంలో మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సెక్రటేరియట్ చుట్టుపక్కల రోడ్లు బ్లాక్ చేసినారు ఎవర్ని రానివ్వటం లేదు. అన్నీ బ్లాక్ చేశారు అధికారులు.
Astrology: ఫిబ్రవరి 03, శుక్రవారం దినఫలాలు