Fire Accident In Secunderabad Swapna Lok Complex: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్‌లోని 7, 8వ అంతస్థుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దట్టంగా పొగలు వ్యాపించడంతో.. ఆ కాంప్లెక్స్‌లో ఉన్న కార్యాలయాల్లోనే ఉద్యోగులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగి, మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపలే చిక్కుకున్న జనాలు.. టార్చిలైట్ వెళుతురు చూపిస్తూ, తమని కాపాడమని ఆర్తనాదాలు చేస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు ధృవీకరించారు. అయితే.. పొగ కమ్మేయడంతో ఉక్కిరిబిక్కిరి పరిస్థితి ఏర్పడింది.
United Alliance Technology: ఉద్యోగాల పేరిట భారీ మోసం.. బోర్డు తిప్పేసిన కంపెనీ
మరోవైపు.. ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న తర్వాత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈవీడీఎం అడిషనల్ కమిషనర్ ప్రకాష్ రెడ్డిలతో మాట్లాడారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజల్ని క్షేమంగా ఈ ప్రమాదం నుంచి కాపాడాలని ఆదేశించారు. అలాగే.. చుట్టుపక్కల ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వారికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో.. డిఆర్ఎఫ్ టీమ్‌లు, ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాయని మేయర్‌కి ప్రకాశ్ రెడ్డి తెలియజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా.. ఈ అగ్నిప్రమాదం స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా.. కాంప్లెక్స్‌లో మొత్తం 12 మంది చిక్కుకున్నట్టు సమాచారం.
Kunamneni Sambasiva Rao: బీజేపీతోనే దేశానికి ప్రమాదం.. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి
మరోవైపు.. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోనూ భారీ అగ్నిప్రమాదం జరిగింది. కోపల్లే ఫార్మా ఇండస్ట్రీ వద్ద సాల్వెంట్ డ్రమ్ములు గాల్లోకి ఎగురుతూ పెద్ద శబ్దంతో పేలడంతో, పరిసరాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమీపంలోని జనప్రియ, మోదీ అపార్ట్ మెంట్ వాసులు హడలిపోతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.