Fire Accident In Scrap Shop In Hyderabad Gaganpahad: హైదరాబాద్‌లోని గగన్ పహాడ్ వద్ద ఓ స్క్రాప్ దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 10 మందికి గాయాలవ్వగా.. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని, మంటలు ఆర్పింది. అలాగే.. ఆ దుకాణంలో చిక్కుకున్న వారిని రక్షించింది. గాయపడిన వారిని రాయల్, అస్లమ్, సద్దాం, అఫ్తాబ్, కమల్, సాహిల్, ప్రతాప్ సింగ్, మామాలుగా గుర్తించారు. వీళ్లందరూ యువకులే. చికిత్స నిమిత్తం వీరిని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారు. మరోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, స్క్రాప్ దుకాణం యజమాని మహ్మద్ బాబుద్దీన్‌పై కేసు నమోదు చేశారు.
Lithium: లిథియంను కనుగొనేందుకు భారతదేశానికి 26 ఏళ్ల పట్టింది..
నగరంలోని పలు ఫార్మా కంపెనీల నుండి కాలం చెల్లిన మందులను బాబుద్దీన్ తీసుకొస్తున్నట్టు తేలింది. వ్యాక్సిన్, ఇంజక్షన్‌లతో పాటు పలు మెడిసిన్‌లకు సంబంధించిన బాటిళ్లను అతడు పదిమంది యువకులతో క్లీన్ చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ బాటిల్స్‌లో ఉన్న మెడిసిన్‌ను క్లీన్ చేస్తున్న సమయంలోనే పేలుడు సంభవించింది. పని చేస్తున్న వారిలో ఒకరు ధూమపానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ బాటిళ్ళలోని మెడిసిన్‌ను బయటికి తీసి, వాటిని క్లీన్ చేసి బాబుద్దీన్ అమ్ముకుంటున్నాడు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అటు.. గాయపడిన వాళ్లంతా యూపీకి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
Abdul Nazeer: ఏపీ కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్