NTV Telugu Site icon

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం.. ఆయన సతీమణికి గాయాలు

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.. ఇవాళ తెల్లవారుజామున విద్యాసాగర్‌ రావు సతీమణి సరోజ ఇంట్లో పిండి పదార్థాలు చేస్తుండగా.. గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో ఎమ్మెల్యే సతీమణి సరోజకు స్వల్పగాయాలు అయినట్టుగా చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.. ఇక, గాయాలపాలైన సరోజకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

Read Also: టెన్షన్‌ పెడుతోన్న ఒమిక్రాన్‌.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు