Site icon NTV Telugu

Yadadri : రైలులో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

Railu

Railu

యాదాద్రి భువనగిరి సమీపంలోని పగిడిపల్లి రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న దక్షిణ ఎక్స్‌ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. నిన్న అర్ధరాత్రి దాటాక పగిడిపల్లి రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే చివరి బోగిలో మంటలు అంటుకున్నాయి. అది లగేజీ భోగిగా రైల్వే అధికారులు చెబుతున్నారు. అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపుచేసారు.

అయితే.. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణీకులు రైలు ఆగగానే కిందికి దిగి పరుగులు తీశారు. దీంతో ఘటనపై సమాచారం అందగానే సికింద్రాబాద్‌ నుంచి ప్రత్యేక రైల్లో సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక శకటాలు రప్పించి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో లగేజీ బోగీలో స్వల్ప ఆస్తినష్టం జరిగినట్లు గుర్తించారు. రైలులో మంటలు చెలరేగిన సమయంలో రైలు ఆగకుండా వెళ్తే పెనుప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మొత్తానికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

LIVE: ఆదివారం నాడు భక్తి శ్రద్ధలతో శ్రీసూర్య స్తోత్ర పారాయణం చేస్తే..?

Exit mobile version