NTV Telugu Site icon

Fire Aciident: చందానగర్‌లో అగ్ని ప్రమాదం.. జేపీ సినిమాస్ మల్టీఫ్లెక్స్‌లో చేలరేగిన మంటలు..

Chandanagar Fair Accident

Chandanagar Fair Accident

Fire Aciident: హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల హబ్సిగూడలోని ఓ బ్రాండెడ్ బట్టల దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదం మరువకముందే చందానగర్‌లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న తపాడియాకు చెందిన మారుతిమల్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో 5వ అంతస్తులోని మల్టీప్లెక్స్ సినిమా హాలుకు చేరుకుంది. మల్టీఫ్యాక్స్‌లోని 5 స్కీన్‌లలో 3 పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు 6, 7 అంతస్తులకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగగా, ఆ సమయంలో మాల్‌లో ఎవరూ లేరు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తపాడియా మాల్ ఇటీవల ప్రారంభించబడింది, కానీ పూర్తి స్థాయి దుకాణాలు ఇంకా అందుబాటులో లేవు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Read also: Heavy Rain in Hyderabad: మరోసారి కమ్ముకున్న మబ్బులు.. నగరంలో కుమ్మేస్తున్న వానలు

ఫైర్ ఆఫీసర్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. టపాడియా మాల్ లో మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చామన్నారు. మాల్ లోని ఐదో ఫ్లోర్లో జేపీ సినిమాస్ లో అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు. 7 ఫైర్ ఇంజన్ లతో మంటలను ఆర్పీ వేసామన్నారు. మంటల తీవ్రత కేవలం లాబిలో మాత్రమే ఉందని అన్నారు. థియేటర్లోని స్క్రీన్ లకు ఎలాంటి మంటలు అంటుకోలేదని అన్నారు. కారిడార్ లో ఉన్న ఫర్నిచర్, సోఫాలకు మంటలు అంటుకున్నాయని తెలిపారు. క్యారిడార్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్ వల్ల మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నామని అనుమానం వ్యక్తం చేశారు. కారిడార్ లో చిప్స్, పాప్కార్న్, కూల్‌డ్రింక్స్ కు సంబంధించిన ప్రతి చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయని అన్నారు. వాటిలోని ఒక షాపులో మంటలు చెలరేగాయని గుర్తించామన్నారు. థియేటర్ సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి ఉంటే తీవ్రత పెరిగేది కాదని తెలిపారు. కారిడార్ లో ఫైర్ జరుగుతుండడంతో ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్‌ ని ఆపివేశారని అన్నారు. థియేటర్ సిబ్బంది వెంటనే స్పందించి ఉంటే మంటలు పెద్దగా వచ్చేవి కావని అన్నారు. సమయానికి ఫైర్ ఇంజన్ లకు వాటర్ సప్లై చేయలేదు, కొంత ఆలస్యం అయ్యిందని వెల్లడించారు.
West Godavari Crime: కొడుకు, కోడలి మధ్య విభేదాలు.. మనవడిని మర్డర్‌ చేసిన తాత.. అసలు కథ వేరే ఉంది..!