NTV Telugu Site icon

Fire Accident: కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం.. కూలర్ల షాప్ నుంచి ఎగిసిపడ్డ మంటలు..

Kukatpalli Fair Accident

Kukatpalli Fair Accident

Fire Accident: కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్ పల్లి జాతీయ రహదారిపై ఓ షాప్ లో మంగలు ఎగిసి పడ్డాయి. టైరు పంచర్, కూలర్ల విక్రయ దుకాణం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలు పక్కనే ఆనుకుని ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని పలు ద్విచక్ర వాహనాలకు నిప్పంటుకోవడంతో పూర్తీగా వాహనాలు దగ్దమయ్యాయి. కూకట్ పల్లి జాతీయ రహదారి కావడంతో ప్రయాణికులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.

Read also:YS Jagan Election Campaign: 28 నుంచి సీఎం వైఎస్ జగన్‌ ఎన్నికల ప్రచారం!

రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రెండు దుకాణాలు దగ్ధం కాగా, 10 ద్విచక్ర వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జాప్యం జరిగితే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని వందలాది ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యేవని పోలీసులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read also:Rahul Gandhi: అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సన్నాహాలు..

అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అగ్నిమాపక సిబ్బంది నిత్యం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వేసవి కాలం కావటం కూడా ఈ అగ్ని ప్రమాదాలకు కారణం. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దుకాణాలు ఒకదానికొకటి దగ్గరగా ఉండటం కూడా కారణం కావచ్చు. వేడితో పాటు షార్ట్ సర్క్యూట్, మానవ తప్పిదాలు కూడా ప్రధాన కారణాలు.
Jagdeep Dhankhar: నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్.. కన్హా శాంతివనం సందర్శన..

Show comments