Site icon NTV Telugu

Land Issue : భూమి కోసం కర్రలతో ఫైటింగ్

Khammam Land Issue

Khammam Land Issue

ఖమ్మం జిల్లా కేంద్రంలో భూముల విలువలు పెరగటంతో దాని కోసం దాడి ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. నగరానికి ఆనుకుని ఉన్న పుట్ట కోట గ్రామంలో 12 ఎకరాల భూమిపై రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ భూమికి సంబంధించి కోర్టు పరిధిలో వివాదం కొనసాగుతుండగా దీనికి సంబంధించి హైదరాబాద్ కు సంబంధించిన వాళ్ళు భూమిని కొనుగోలు చేశామని భూమి వద్దకు వచ్చారు. దీంతో స్థానికంగా ఉన్న కొంతమంది వారిమీదికి దాడికి పాల్పడ్డారు.

కట్ చేస్తే…. తమ మీద దాడికి పాల్పడ్డారని యాకూబ్ పాషా తన లాయర్ అయిన పుష్పలతతో కలసి నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్ మీట్ పెడుతుండగా కొంతమంది వచ్చి వివాదాన్ని సృష్టించారు. లాయర్ పై దాడికి పాల్పడ్డారు మహిళా లాయర్ జుట్టు పట్టుకొని.. చెంప మీద కొట్టారు ఇద్దరు మహిళలు. అయితే.. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు.

Exit mobile version