Site icon NTV Telugu

CM KCR: కేసీఆర్‌పై అమితాభిమానం.. ఐదో తరగతి విద్యార్థిని డ్రాయింగ్ ప్రతిభ

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఐదో తరగతి విద్యార్థిని ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన గుర్రం మేఘన (9) ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. ఆమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆమె తల్లిదండ్రులు డ్రాయింగ్ నేర్చుకోవడానికి మేఘనను ప్రోత్సహించారు. అయితే మేఘనకు సీఎం కేసీఆర్ కూడా ఇష్టం ఉండటంతో సుమారు 100కు పైగా చిత్రాలను వివిధ రంగులతో డ్రాయింగ్ వేసి అందరినీ అబ్బురపరుస్తోంది. కేవలం హరితహారం పథకం గురించే 20కి పైగా కేసీఆర్ చిత్రాలను మేఘన డ్రాయింగ్ వేయడం విశేషం.

అటు ఈనెల 17న కేసీఆర్ బర్త్ డే సందర్భంగా రావి ఆకుపై 14 సంక్షేమ పథకాలతో కూడిన కేసీఆర్ చిత్రాన్ని మేఘన పెయింటింగ్ వేసింది. గతంలో కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై డ్రాయింగ్ వేసినప్పుడు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ తనను మెచ్చుకుని ప్రశంసించారని మేఘన తెలిపింది. కాగా తన కుమార్తెకు డ్రాయింగ్ అంటే ఎంతో ఇష్టం ఉండటంతో అందులో మెలకువలు నేర్పించి మరింత ప్రోత్సహించినట్లు మేఘన తండ్రి వెంకటేష్ వెల్లడించారు.

Exit mobile version