Tigers in Adilabad: తెలంగాణలో పులులు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఐదురోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో 4 పులులు సంచరించడం కలకలం రేపుతోంది. రాష్ట్రాన్ని వీడిందని ఊపిరి పీల్చుకుంటున్న ఆదిలాబాద్ వాసులకు మళ్లీ పులుల భయం పట్టుకుంది. ఇవాళ ఉదయం పులి అడుగుజాడలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. పులులు రాష్ట్రాన్ని దాటిందని వెళ్లిందనుకునేలోపే మళ్లీ పులుల భయం షురూ అయ్యింది.. పులి భయం ఇంకా ఎన్నాళ్లు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్ మండలం వడూర్ శివారులలో పులి సంచారం మళ్లీ మొదలైందని ప్రజలు జంకుతున్నారు. బయట తిరగాలంటేనే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని తెలుపుతున్నారు. భైరవ గుట్ట, పెనుగంగా సమీపంలో పులి స్థానికుల కంట పడటంతో భయంతో పరుగులు పెట్టామని తెలిపారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్ధానికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడకు చేరుకుని పులి సంచరించిన పాదముద్రలను గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు.
Read also: YS Jagan and Chandrababu: ఢిల్లీకి సీఎం జగన్.. అదే సమయంలో చంద్రబాబు హస్తిన బాట
తాజాగా.. రోడ్డుపై నాలుగు పులులు కనిపించగా పత్తి చేనులో రైతుకు పులులు కనిపించడంతో రైతులు భయకంపితులు అవుతున్నారు. మరో వైపు పులుల పాదముద్రలు ట్రాకింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. టైగర్ ఫియర్ ట్రాకింగ్ కొలిక్కి వస్తే ఎన్ని పులులు వున్నాయనేది అంచనాకు రావచ్చంటున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసికే శివారులో కనిపించిననాలుగు పులులు,కొద్ది రోజుల వ్యవధిలో రెండో సారి కనిపించాయి నాలుగు పులులు. బెజ్సూర్ మండలం, మర్తడి,కుంటలు, కుకుడ శివారు ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే..
Sandeep Vanga: అర్జున్ రెడ్డిని మించి…