NTV Telugu Site icon

Breaking : కన్న బిడ్డమీద కనికరం లేదా.. ఎందుకిలా చేశావ్‌..

కొందరు కొందరు చేసే పనులకు.. వారు ఏం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారో అర్థం కాదు. నవమాసాలు మోసి కన్న తల్లి, భుజాలపై ఎత్తుకుని ఆడించాల్సిన తండ్రి.. వీళ్లే ఆ బిడ్డ పాలిట యమకింకరులైతే.. అప్పుడే పుట్టి ఈ లోకంలోకి వచ్చిన ఆ నవజాత శిశువు పరిస్థితి ఏంటో ఓ సారి ఆలోచించాలి. అలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వారం రోజుల పసికందు అనారోగ్యంతో ఉండడంతో.. స్మశానానికి చేర్చాడు ఓ తండ్రి.. అయితే శిశువులో కదలికలు గుర్తించిన వారి బంధువు హుటాహుటిన జగిత్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాడు.

అయితే విషయం తెలిసిన శిశు సంక్షేమ శాఖ అధికారుల ఆసుపత్రికి చేరుకున్నారు. కరీంనగర్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో వైద్యం అందించలేక నిన్న నేరుగా స్మశాన వాటికకు తరలించినట్టు శిశు సంక్షేమ శాఖ అధికారుల గుర్తించారు. వైద్య ఖర్చు భరించలేక శిశువును వదిలి తండ్రి పరారైనట్లు వెల్లడించారు. తల్లిదండ్రులను పిలిపించి శిశు సంక్షేమ శాఖ అధికారులు దర్యాప్తు చేశారు. డబ్బులు కట్టే స్థోమత లేక వదిలేసినట్టు తెలిసింది. అయితే శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.