యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కలెక్టర్ ఛాంబర్ ముందు తండ్రి, కుమారుడు ఒంటిపై పెట్రోల్ పోసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఆలేరు మండలం కొలనుపాకలో తమకు 4 ఎకరాల భూమి ఉందని ఉప్పలయ్య అనే వ్యక్తి వెల్లడించాడు.
Read Also: దేశంలోనే నంబర్‌వన్ ఆస్పత్రిగా గాంధీ ఆస్పత్రి
20 ఏళ్ల క్రితం నాలుగు ఎకరాల భూమిని రూ.6వేలకు కొనుగోలు చేశానని… అయితే తనకు ఇప్పటికీ అధికారులు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వలేదని ఉప్పలయ్య ఆరోపించాడు. ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాలకు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్య వైఖరికి తట్టుకోలేక సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో ఉప్పలయ్య, అతడి కుమారుడు మహేష్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా అధికారులు అప్రమత్తమై వారిని వారించారు.