Nagole Accident: హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ, ఎలక్ట్రిక్ స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంటల్లో టిప్పర్ లారీ దగ్ధమైంది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి పాపాయి గూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది.
Read also: Yadadri Temple: రికార్డు స్థాయిలో యాదాద్రి ఆదాయం.. మెుత్తం కానుకలు రూ. 3.15 కోట్లు..!
కుత్బుల్లాపూర్‌కు చెందిన కుతాడి కుమార్, అతని కుమారుడు ప్రదీప్ (7వ తరగతి చదువుతున్నాడు) తండ్రీ కొడుకు ఇద్దరు కలిసి ఎలక్ట్రిక్ బైక్‌పై వెళుతున్నారు. ఈ క్రమంలో పాపాయి గూడ చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బైక్ ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత టిప్పర్ లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ, ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా టిప్పర్ లారీలో మంటలు రావడంతో అక్కడే వున్న ప్రదీప్ కూడా సజీవ దహనమయ్యాడు. అతని తండ్రి కుమార్ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే కుటుంబంలో తండ్రీకొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉండగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
IIT Bombay: సత్తా చాటిన ఐఐటీ బాంబే విద్యార్ధులు.. 85 మందికి కోటికి పైగా వేతనం..
