Site icon NTV Telugu

Cheating: హైదరాబాద్‌ లో ఘరానా మోసం.. రూ.16.10కోట్లు కాజేసిన తండ్రీకొడుకులు

Cheating

Cheating

Father and son cheated another father and son of 16 dot 10 crore rupees in hyderabad: తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌ లో చోటుచేసుకుంది. ఏకంగా రూ. 16.10 కోట్లు కాజేసారు. దీంతో బాధితులు పోలీసులకు ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందుతులను రాజధాని నగరంలో అదుపులో తీసుకున్నారు. సుమారు రూ. 16.10కోట్లు స్వాధీనం చేస్తున్నారు. అయితే.. ఈ మోసానికి పాల్పడిన నిందితులు కూడా తండ్రి, కుమారుడే కావడం గమనార్హం.

తండ్రి కొడుకులను పథకం ప్రకారం మోసం చేసేందుకు నిందితులు శివశంకర్‌, కోమల్‌ ప్రసాద్‌ ప్లాన్‌ వేసారు. సునీల్‌, అతని కుమారుడు ఆశిష్‌ ను మోసం చేసి డబ్బు కాజేసేందుకు స్థలం వుందని వారిద్దరిని నమ్మించారు. ఒకరికి తెలియ కుండా మరొకరికి స్థలం చూపించారు. నిందితుడు శివశంకర్‌ తనకు నగరంలోని షేక్‌పేటలో తనకు స్థలం ఉందని, చాలా చవకగా దొరుకుతుందని మంచిగా వుంటుందని నమ్మించాడు బాధితుడు సునీల్ కు నమ్మించాడు. దీంతో శివశంకర్‌ ను నమ్మిన సునీల్‌ రూ.6.5 కోట్లు ఇచ్చాడు. అయితే.. శివశంకర్‌ కు కొడుకు కుమారుడు కోమల్‌ ప్రసాద్‌.. సునీల్‌ కుమారుడు అశిష్‌ను కలిసి కొండాపూర్‌లోని ఓ వాణిజ్య సముదాయంలో మూడో అంతస్తు మొత్తం నీకే ఇస్తానంటూ రూ.9.6 కోట్లు కాజేశాడు. మొత్తంగా రూ. 16.10కోట్లు కాజేసారు. స్థలం గురించి వారిద్దరి దగ్గర ఎటువంటి సమాచారం లేకపోవడంతో.. తండ్రీ కొడుకులు మోసపోయామని భావించారు. బాధితులు సునీల్‌, ఆశిష్‌ వేర్వేరుగా ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు చేసిన సీసీఎస్‌ పోలీసులు నిందితుల పేర్లు చూసి షాక్‌ తిన్నారు.

read also: Pawan Kalyan: కేటీఆర్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పవన్.. మంత్రికి స్పెషల్ ట్వీట్

శివశంకర్‌, కోమల్‌ప్రసాద్‌ కూడా తండ్రీకొడుకులేనని తెలుసుకున్నారు. కాగా.. షేక్‌పేటలో తనకు స్థలం ఉందని శివశంకర్‌ రెండేళ్ల క్రితం సునీల్‌కు చెప్పాడు. వాణిజ్య భవనం నిర్మించి 8వేల చదరపు అడుగుల ఏరియా ఇస్తానని నమ్మించి, 2020లో రూ.6.5 కోట్లు తీసుకున్నాడు. కాగా.. శివశంకర్‌ కుమారుడు కోమల్‌ ప్రసాద్‌, సునీల్‌ కుమారుడు అశిష్‌ను కలిసి కొండాపూర్‌లోని ఓ వాణిజ్య సముదాయంలో మూడో అంతస్తు మొత్తం నీకే ఇస్తానంటూ రూ.9.6 కోట్లు తీసుకున్నాడు. డబ్బు కోసం నిలదీయగా ఇద్దరూ చేతులెత్తేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
CI Serious On TDP Protest: ఎంపీ మాధవ్ తరహాలో మీ వాళ్లు చేయలేదా? దుమారం రేపుతున్న సీఐ వ్యాఖ్యలు

Exit mobile version