NTV Telugu Site icon

Road Accident: వరంగల్ లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి కూతురు మృతి

Untitled 7

Untitled 7

Warangal: సంతోషం వెల్లివిరియాల్సిన పండుగ వేళ ఓ కుటుంబంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. పండుగ వేళ కూతురిని అల్లుడుని పిలిచి సారి పెట్టాలనుకున్న కుటుంబం చావు కబురు వినాల్సి వచ్చింది. సంతోషంగా అల్లుడుతో కలిసి రావాల్సిన కూతురు విగత జీవిగా మారింది. తండ్రి కూతురు ఒకేసారి ఈ లోకాన్ని వదిలి అనంతలోకాలకు వెళ్లారు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం లోని మొరిపిరాలకు చెందిన వెంకన్న కూతురు అనూష, అల్లుడు రాజేశ్‌ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే దసరాకు కుమార్తెని అల్లుడిని ఇంటికి తీసుకురావాలని ఆశపడ్డారు వెంకన్న.. అయితే అతని ఆశ అడియాస అయింది.

Read also:Cyclone Tej: పెరగనున్న తేజ్ తుఫాను తీవ్రత.. ఈ రాష్ట్రానికి ముప్పు

కూతురుని అల్లుడిని తీసుకు రావడానికి హైదరాబాద్ వెళ్లిన వెంకన్న.. కూతురుని అల్లుడిని హైదరాబాద్ నుంచి మెరిపిరాలకు తీసుకు వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైయ్యారు. రాయపర్తి మండలం కిష్టాపురం సమీపానికి రాగానే వాళ్లు ప్రయాణిస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న అతని కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా రాజేష్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు రాజేష్ ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకి సమాచారం అందిచారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కార్ డ్రైవర్ పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.