NTV Telugu Site icon

Warangal Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య..!

Warangal Accident

Warangal Accident

Warangal Accident: వరంగల్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ నుంచి తొర్రూరు వైపు ఆటో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ముగ్గురిని అంబులెన్స్‌లో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు తేనె విక్రయించే కూలీలని తెలిసింది. అయితే మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.

Read also: Jangaon: జనగాంలో దారుణం.. మైనర్ బాలికల శరీరంపై కారం చల్లి..

మద్యం మత్తులో లారీ నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. లారీని రాంగ్ రూట్‌లో నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలన్నీ ఆటోలో ఇరుక్కుపోయాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతుల వివరాలు, వారి స్వస్థలం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. మృతదేహాలన్నీ ఆటోలో ఇరుక్కుపోయినా స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
Jailer: రజనీ ర్యాంపేజ్… 500 కోట్లు

Show comments