NTV Telugu Site icon

Farmers Cricket Match: ఉత్సాహంగా రైతుల క్రికెట్ పోటీలు.. విజేతలు ఎవరంటే?

Cric

Cric

క్రికెట్ అంటే కొంతమందే ఆడతారని, వారంతా ప్రొఫెషనల్స్ అని అంతా భావిస్తారు. అయితే నాగలి పట్టి, పొలం దున్నే రైతన్నలు కూడా తామేం తక్కువ కాదంటున్నారు. నాగలి పట్టినట్టే, క్రికెట్ బ్యాట్ పడితే సిక్స్ లు, ఫోర్లు, బౌండరీలు బాదేస్తాం అంటున్నారు. నిర్మల్ జిల్లాలో అన్నదాతలు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. ఉత్సాహంగా రైతన్నల క్రికెట్ పోటీలు నిర్వహించారు రైతులు. నిర్మల్ జిల్లా రూరల్ మండలం అనంతపేట గ్రామంలో మాదాస్తు సునీత ఆధ్వర్యంలో చేపట్టిన రైతన్నల క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి.

Read Also: Postmartem Building: నెరవేరని మంత్రి హరీష్ రావు హామీ…నేలమీద డెడ్ బాడీలు

ఈ పోటీల్లో అనంతపేట, నీలాయిపేట, మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాలకు చెందిన రైతులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. మొదట అదిలాబాద్ ఉమ్మడి జిల్లా టిఎన్జీవో అధ్యక్షులు శ్యాం నాయక్ , నిర్మల్ మండల ఎంపీపీ కొరుపెల్లి రామేశ్వర్రెడ్డి టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. మొదటి బహుమతిగా 5వేలు, రెండవ బహుమతిగా 3 వేలు, మూడవ బహుమతి 2 వేలు అందచేశారు. అలాగే నాలుగో బహుమతిగా విజేతలకు వెయ్యి రూపాయలు నిర్వాహకులు అందచేశారు. మొదటి విజేతగా మేడిపల్లి గ్రామ రైతులు నిలిచారు. రెండవ విజేతగా నీలాయిపేట గ్రామ రైతులు బహుమతి గెలుచుకున్నారు. మూడవ విజేతగా ఎల్లారెడ్డిపేట గ్రామ రైతులు బహుమతి అందుకున్నారు. నాలుగవ విజేతగా అనంతపేట గ్రామ రైతులు నిలిచారు. రైతులు క్రికెట్ ఆడుతుంటే చూసేందుకు జనం ఉత్సాహం చూపించారు.

Read Also: IT layoffs: 4 నెలల్లో 3 కంపెనీలు ఉద్యోగం నుంచి తొలగించాయి.. ఓ టెక్కీ ఆవేదన