NTV Telugu Site icon

Farmers: ఎంపీ అర్వింద్‌కు నిరసన సెగ.. ఇంటి ముందు వడ్లు పోసి ఆందోళన..

Farmers

Farmers

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు మరోసారి రైతుల నుంచి నిరసన సెగ ఎదురైంది.. ఈ సారి ఏకంగా అర్వింద్‌ ఇంటిని ముట్టడించారు రైతులు.. ఆర్మూర్‌లోని అర్వింద్‌ నివాసం ముందు వడ్లను పారబోసి నిరసన చేపట్టారు రైతులు.. జిల్లా నలుమూలనుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన రైతులు.. బీజేపీ నేతలు చెబితేనే వరి వేశాం.. కాబట్టి ఎప్పటిలాగానే కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట‌ను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు.. కాగా, వరి కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయాల్సిందేనంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాక ఆందోళనలు చేసింది అధికార టీఆర్ఎస్‌ పార్టీ.. కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ డెడ్‌లైన్‌ కూడా పెట్టిన విషయం తెలిసిందే.

Read Also: KGF 2 : మెగాస్టార్ పై ‘కెజిఎఫ్’ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్