Formers: తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయి. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులకు పైగా ధాన్యం ఉందని రైతులు గుర్తు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసింది. వరంగల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నల్గొండ, నిజామాబాద్, కామారెడ్డిలో వర్షం కురిసింది. ఖమ్మం కారేపల్లి మండలంలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసింది.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ లో రైతన్నలు రోడ్డెక్కారు. అకాల వర్షాలతో వడ్లు తడుస్తున్నాయని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నాందేడ్ – అఖోల నేషనల్ హైవేపై రైతులు ధర్నా చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన చేప్టటారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు వేసి రైతులు నిరసన తెలిపారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది. ధాన్యం కొనేవరకు ధర్నా విరమించేది లేదని రైతులు పట్టుబట్టి కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రైతులు వినకపోవడంతో పోలీసులుకు కూడా ఏం చేయలేకపోయారు.
నిర్మల్ జిల్లా ఖానపూర్ లో రైతుల ఆందోళన చేపట్టారు. ఖానాపూర్ మార్కెట్ యార్డ్ కు రైతులు తెచ్చిన వడ్లను కొనుగోలు చేయడంలో అధికారుల అలసత్వంతో రైతులు నష్ట పోతున్నారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వడ్లు తడవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. వడ్ల సంచులతో రాస్తారోకో చేస్తున్న రైతులు.. భారీగా స్తంభించిన వాహనాలు..
పెద్దపల్లి జిల్లా మంథని లో తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షానికి మంథని మార్కెట్ యార్డ్ లో ధాన్యం తడిసి నీటిలో కొట్టుకుపోతున్న వీడియోలు రైతులను కంటతడి పెట్టిస్తోంది. టార్ఫాలీన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో.. ధాన్యం నీటిలో తడిసి బియ్యంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తడిసి ముద్దయిన కాంటా సంచుల్లో ధ్యాన్యం నింపుతున్నమని తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం కారణంగా వరి ధాన్యం తడిసి ముద్దైంది. లక్సెట్టిపేట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల జిల్లా. దండేపల్లి మండలాల్లో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లాలో మంగళవారం ఉదయం వరకు వర్షం కురిసింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరిధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం జనగాం, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Shubman Gill Records in IPL: విజేత చెన్నై అయినా.. స్టార్ మాత్రం అతడే..
